Balakrishna NTR : తెలుగు తెరపై ఇప్పటికే అనేక హీరోలకు చెందిన కాంబినేషన్లు వచ్చాయి. అప్పట్లో ఇప్పట్లో చాలా మంది కాంబినేషన్‌లలో నటించారు. మల్టీ స్టారర్ మూవీలు ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉన్నాయి. అయితే ప్రేక్షకులు మాత్రం ఎంతో కాలం నుంచి ఒక కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది వర్కవుట్ అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. అయితే వారు ఎలాగూ సినిమా తీయడం లేదు కదా.. కనీసం ఫొటోషాప్ చేసి అయినా తమ సరదా తీర్చుకుందామని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇంకేముందీ.. తమ అభిమాన హీరోలకు చెందిన ఫొటోను వారు ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నందమూరి వంశంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ లకు ప్రస్తుతం ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఈ మధ్యే బాలయ్య అఖండతో అలరించగా.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరూ విడి విడిగా సినిమాలు చేస్తున్నారు కానీ కలసి మాత్రం ఒక్క మూవీ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారు తమ కల తీరుతుందో.. తీరదో.. అనుకున్నారో.. ఏమో.. తెలియదు కానీ.. ఫొటోషాప్ ద్వారా ఆ సరదాను తీర్చుకున్నారు. ఎన్‌టీఆర్, బాలయ్యను కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూసుకునేలా ఒక ఫొటోను వారు ఎడిట్ చేశారు.
బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ఎన్‌బీకే 107 మూవీలోని ఆయన గెటప్‌తో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి అందులో ఎన్‌టీఆర్ ముఖాన్ని పెట్టారు. తరువాత బాలయ్య, ఎన్‌టీఆర్ ఫొటోలను కలిపారు. దీంతో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ లను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఫొటోనే ఇలా ఉంటే.. ఇక వీరు నిజంగానే సినిమాను తీస్తే.. అప్పుడు తెరపై వీరిద్దరూ కనిపిస్తే.. అది ఎలా ఉంటుందో.. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ కూడా అలాగే ఫీలవుతున్నారు. ఇక ఈ ఫొటోను వారు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు అయినా సరే భవిష్యత్తులో బాలయ్య, ఎన్‌టీఆర్‌లు కలసి సినిమాను చేస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…