Chiranjeevi : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించి ఇప్పటి మాట్లాడుకుంటుంటారు. దీంతో అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం మొత్తం తన వైపు చూసేలా చేసాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి
కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్‌గానే మిగిలాయి. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆరిపోతున్న అగ్నికి ఆజ్యం పోసినట్టు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడు. మా చిరంజీవినే అంటావా.. నిన్ను క్షమించేది లేదంటూ గరికపాటిని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా ట్వీట్లు వదులుతున్నాడు.
బుధవారం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా ఉన్నాయి. గరికపాటి నరసింహారావు గతంలో తన ప్రవచనాల్లో ఆడవాళ్ల వేషధారణ, వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. అత్యాచారాలకు గురికావడంలో మహిళలదే బాధ్యత అని గడ్డిపాటి చెబుతున్నారు. ఆత్మగౌరవం కలిగిన మహిళలందరూ ఇతడిని బొందపెట్టాలి అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా హిందుత్వం పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్న గరికపాటి నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్, మానవతావాది బాబూ గోగినేని ఇంకా వ్యగ్యంగా స్పందించాడు. ఈయన చిరంజీవిని సైతం అగౌరవపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రామ్ గోపాల్ వర్మ గారు ఏమో ఆడవాళ్ళను కించపరిచే గరికపాటిని ఇలా వంగదీసి గుద్దుతున్నారు. అక్కడ చిరంజీవి గారేమో మీ భావాలూ నా భావాలూ దగ్గరగా ఉంటాయి మనం కలిసి భోజనం చేయాలి అని గరికపాటితో అంటున్నారు. అలా కలిసేవి ఏ భావాలో మరి? భోజనం అప్పుడు వీరిద్దరూ ఏమి మాట్లాడుకుంటారో..? అంటూ వ్యగ్యంగా, వివాదాస్పదంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాబూ గోగినేని ట్వీట్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…