Vijay Sethupathi : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో వెనుక నుండి ఓ వ్యక్తి వచ్చి తన్నినట్లుగా ఈ వీడియోలో ఉంది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని విజయ్ సేతుపతి వదిలేశారు. ఆ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేసి.. ఆ ప్రయాణికుడికి, విజయ్ అసిస్టెంట్ కి మధ్య గొడవ సాల్వ్ అయినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో చాలా వరకు వైరల్ అయ్యి.. పెద్ద వివాదానికి దారి తీసింది. హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్ మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూ మక్కల్ కట్చి అనే ఆర్గనైజేషన్ విజయ్ సేతుపతిని కొట్టిన వారికి 1001 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తామంటూ ప్రకటించారు.
ఎందుకంటే స్వాతంత్య్ర సమరయోధులైన దైవతిరు పసుంపోన్ ముత్తు రామలింగ తేవర్ అయ్యను, ఇంకా దేశాన్ని అవమానించేలా మాట్లాడారని అన్నారు. అలాగే వీటికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ని కూడా పోస్ట్ చేశారు. ఈ వివాదంపై హిందూ మక్కల్ కట్చి సంస్థకు సంబంధించిన వ్యక్తి అర్జున్ సంపత్ మాట్లాడుతూ.. తాను ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిన మాట వాస్తవమేనని.. అయితే విజయ్ సేతుపతిని తన్నేందుకు ప్రయత్నించిన వ్యక్తి అయిన మహాగాంధీతో మాట్లాడానని, విజయ్ సేతుపతి ఆ వ్యక్తితో చాలా హేళనగా మాట్లాడటం వల్లే ఆ వ్యక్తి గొడవ పడినట్లు తెలిపారు. విజయ్ కు జాతీయ అవార్డ్ వచ్చినందుకు ఆ వ్యక్తి విష్ చేయాలని అనుకుంటే.. విజయ్ సేతుపతి చాలా వెటకారంగా స్పందించారని, అసలు ఇది దేశం కాదన్నారని అన్నారు.
మీరు సౌత్ నుండి వచ్చారని, పసుంపోన్ కు అటెండ్ అవ్వాలని.. ప్రపంచానికి ఒకే ఒక దైవం జీసస్ మాత్రమేనంటూ విజయ్ సేతుపతి ఆ వ్యక్తితో అన్నాడని, అందుకే మహాగాంధీ అలా రియాక్ట్ అయినట్లుగా అర్జున్ సంపత్ తెలిపారు. ఈ విషయంపై ఆ వ్యక్తికి నగదు బహుమతి ప్రకటించానని అన్నారు. ఇక ఈ విషయంలో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హిందూ మక్కల్ కట్చి సంస్థపై, అర్జున్ సంపత్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ ఫేవరెట్ అభిమానిపై ఇలా ఆరోపణలు చేయడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…