Aryan Khan : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్యాన్ ఖాన్ తన ఫ్రెండ్ అర్భాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలను కూడా ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రూయిజ్ షిప్ లో వీరు ముగ్గురు పార్టీ చేసుకుంటున్న టైమ్ లోనే డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా ముంబై కోర్ట్ లో ఈ ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు పోలీసుల ఆధ్వర్యంలో సంతకాలు చేయాల్సి ఉంది.
అలా రీసెంట్ గా ఆర్యన్ ఖాన్, అర్భాజ్ మర్చంట్ సైన్ చేసేందుకు ఎన్సీబీ ఆఫీస్ లకు వచ్చారు. అర్బాజ్ మర్చంట్ వస్తూండగా ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ అర్బాజ్ పట్టించుకోకుండా వెళ్లాడు. స్టేషన్ ముందు ఉన్న అర్బాజ్ తండ్రి అతన్ని ఆపి వెనక్కి లాగి మరీ ఫోటోలకు పోజులివ్వాలని అన్నాడు. దీంతో అర్బాజ్ కి కోసం వచ్చి.. స్టాపిట్ డాడ్.. అని అసహనం వ్యక్తం చేశాడు. తన కొడుకు ఫ్రస్టేషన్ చూసి అస్లామ్ నవ్వుకున్నారు.
ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బెయిల్ వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నావు. కానీ ఆ బెయిల్ రావడానికి ఆ తండ్రి పడిన కష్టం గురించి ఆలోచించావా.. ఒకవేళ బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే తన కొడుకు పై వచ్చిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. ముంబై కోర్ట్ కూడా ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపిందని ఆయన అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…