Arundhati Movie : సూపర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనుష్క. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. వరుస సూపర్ హిట్ లు అందుకోవడంతో హీరోల రేంజ్ లో అనుష్క క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ అనుష్క కోసం సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో కేవలం హీరోల పక్కన సినిమాలు చేసిన అనుష్క ఆ తరవాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అదరగొట్టింది.
అనుష్క లీడ్ రోల్ చేసిన అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు తెర వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నడిచింది. ఓ పార్టీలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి బంధువు పదే పదే గద్వాల్ కోట గురించి మాట్లాడుతండగా ఆయనకు ఆసక్తికరంగా అనిపించిందట.
అంతే కాకుండా చిన్నప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి తాత కూడా ఓ కోట గురించి చెబుతూ.. కోటలో రాజకుమారి పనివాడితో ఉండగా చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిలో వారిని సమాధి చేశాడని చెప్పాడట. ఈ రెండింటినీ మూలంగా చేసుకుని సినిమా చేయాలని శ్యాం ప్రసాద్ నిర్ణయించుకున్నారట. అప్పటికే అంజి ఫ్లాప్ తో ఉన్నప్పటికీ మరోసారి కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే సినిమానే చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
అలా అరుంధతి సినిమాకు బీజం పడింది. ఆ తరవాత దర్శకుడు కోడి రామకృష్ణను పిలిచి కథను డెవలప్ చేశారు. అనంతరం అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సినిమాలో కోట కోసం రూ.8 కోట్లతో సెట్ ను వేశారు. అంతే కాకుండా అనుష్క కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అనుష్క, దర్శక నిర్మాతల కష్టానికి ఫలితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అరుంధతి కథ నిజంగా జరిగింది కాకపోయినా.. సినిమాను చూస్తే మాత్రం అలాంటి ఫీల్ వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…