Arunachalam Movie : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఒకటి అరుణాచలం. 1997వ సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీ ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ రజనీ కెరీర్ హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కథ చాలా మందికి నచ్చింది. నెల రోజుల్లో రూ.30 కోట్లను ఖర్చు పెడితే రూ.3000 కోట్ల ఆస్తి వస్తుందనే కథతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. చివరకు హీరో ఎలాగో కష్టపడి ఆ విధంగా చేస్తాడు. దీంతో రూ.3000 కోట్ల ఆస్తి వస్తుంది. అయితే దాన్నంతా ట్రస్ట్‌కే ఇచ్చేసి అరుణాచలం తిరిగి సొంత ఊరికి వెళ్లిపోతాడు. ఈ విధంగా సినిమా కథ ముగుస్తుంది.
అయితే 30 రోజుల్లో రూ.30 కోట్లను ఖర్చు పెట్టడం ఆకాలంలో చాలా కష్టమే. కానీ ఇప్పుడు అది ఎంతో సులభం అనే చెప్పవచ్చు. అవును.. 30 రోజుల్లో రూ.30 కోట్లను ఖర్చు పెట్టాలని ఎవరైనా కండిషన్ పెడితే గనక దాన్ని సులభంగా సాధించవచ్చు. రూ.30 కోట్లను మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా ఖర్చు చేయవచ్చు. అందుకుగాను ఎలాంటి జూదం ఆడాల్సిన పనిలేదు. రాజకీయాల్లోకి వెళ్లాల్సిన, సినిమాలు తీయాల్సిన పని అసలే లేదు. మరి రూ.30 కోట్లను 30 రోజుల్లో ఎలా ఖర్చు చేయాలి.. అందుకు ఏం చేయాలి.. అంటే..
వెస్టిండీస్‌లోని సెయింట్ లూసియా అనే ప్రాంతం వద్ద ఉన్న కరేబియన్ సముద్రంలో ఓ కంపెనీ సబ్‌మెరైన్ హోటల్స్ ను నిర్వహిస్తోంది. లవర్స్ డీప్ పేరిట వీటిని నడుపుతున్నారు. అయితే పేరు ఇది సబ్‌మెరైన్. కానీ మొత్తం ఓపెన్ ఉంటుంది. సబ్ మెరైన్ గ్లాస్ రూపంలో ఉంటుంది. అందువల్ల అందులో ఉంటే సముద్రంలో ప్రయాణించేటప్పుడు మన చుట్టూ ఉండే జీవరాశులను చూడవచ్చు. సముద్రంలో అలా గ్లాస్ సబ్‌మెరైన్‌లో విహరిస్తుంటే వచ్చే మజాయే వేరు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
ఇలా సబ్ మెరైన్ లో ప్రయాణించాలంటే రోజుకు 2.92 లక్షల డాలర్లను వసూలు చేస్తారు. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ.2.24 కోట్లు అన్నమాట. అంటే ఇందులో దాదాపుగా రెండు వారాల పాటు.. అంటే 14 రోజులు ఉంటే చాలు.. రూ.30 కోట్లు అవుతాయి. ఇలా రూ.30 కోట్లను సులభంగా ఖర్చు చేయవచ్చు. అందులోనూ ఇచ్చిన గడువులో సగం రోజుల్లోనే పని పూర్తి చేయవచ్చు. దీంతో పందెంలో సులభంగా గెలుస్తారు. నిజంగానే రూ.30 కోట్లను 30 రోజుల్లో ఖర్చు చేయాలని ఎవరైనా కండిషన్ పెడితే సులభంగా దాన్ని ఈ హోటల్‌లో ఉండడం ద్వారా ఖర్చు చేయవచ్చు. అయిత అలా సినిమాల్లోనే జరుగుతుంటుంది. నిజ జీవితంలో జరగదు.
ఇక ఈ సబ్‌మెరైన్ హోటల్‌లో మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండవచ్చు. ఒక ప్రత్యేక గదిని, వంట మనిషిని కేటాయిస్తారు. రూమ్ సర్వీస్ ఉంటుంది. అందులో ఎన్ని రోజులంటే అన్ని రోజులు గడపవచ్చు. కానీ రోజుకు మాత్రం రూ.2.24 కోట్లు ఇవ్వాలి. ఊహించుకుంటేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి కదా.. ఇక అందులో సామాన్యులకు ఎంట్రీ ఎలా ఉంటుంది చెప్పండి.. కేవలం సంపన్నులు మాత్రమే అందులోకి వెళ్లగలరు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…