Tollywood : ప్రస్తుత తరుణంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సాధారణ ప్రజల్లోనూ ఈ కల్చర్ పెరిగిపోయింది. మారుతున్న జీవనశైలి, వ్యవహారాలు, ప్రవర్తన, ఉద్యోగాలు, ఇతర సంబంధాలు, ఆర్థిక సమస్యలు.. ఇవన్నీ విడాకులకు కారణం అవుతున్నాయి. ఇక సెలబ్రిటీలు అయితే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు గాంచిన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్‌లు విడాకులు తీసుకున్నారు. ఇలా సెలబ్రిటీ కపుల్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే మరో టాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌కు చెందిన ఓ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. వారు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఫిలిం నగర్‌లో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు తెలుగు వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. వారి ఒక పాప ఉంది. ఇద్దరూ సింగర్స్‌గా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతో చెప్పి చూశారట. అయినప్పటికీ వారు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారట. దీంతో చుట్టూ ఉన్నవారు చేసేదేం లేక అలాగే ఉండిపోయారట. ఈ క్రమంలోనే వారి విడాకులు దాదాపుగా ఖాయం అయిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వారు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ విడాకులకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. భార్యభర్త ఇద్దరూ సంపాదిస్తున్నారు కనుక.. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. అదే సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీరి విడాకుల విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…