Anjali : తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది అంజలి. హోమ్లీ పాత్రలతో అందరినీ ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో అంజలికి మంచి పేరొచ్చింది.
తమిళ హీరో జై తో చాలా కాలం ఆమె సహజీవనం చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత అంజలికి తెలుగులో ఐటెం సాంగ్ లో అవకాశం వచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ ఒక ఊపు పేసింది. రా రా రెడ్డి అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం అంజలి ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంజలి దాదాపుగా 2006 నుంచి 15 ఏళ్ళకి పైగా నటిగా కొనసాగుతోంది. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగిన నటి భారీగానే ఆస్తులు కూడబెట్టుకొని ఉంటుంది. కానీ అంజలికి ఆస్తులు అంతగా లేవట. ఆమె ఆస్తులపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అంజలి మొత్తం ఆస్తుల విలువ రూ.10 కోట్లు ఉన్నాయట. దాదాపు 15 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతున్న నటి ఆస్తులు ఇంతేనా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక్కో మూవీకి దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకునే అంజలి ఆస్తుల విలువ ఇంతేనా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఆమె తప్పేనా అంటూ కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అంజలి పిన్నితో ఆస్తికి సంబంధించిన గొడవలు చాలా రోజుల క్రితం మొదలయ్యాయి. దీని గురించి తేల్చుకునేందుకు వాళ్ళు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ ఎవరినీ నమ్మకూడదని డిసైడ్ అయినట్లు అంజలి గతంలో తెలిపింది. ప్రస్తుతం అంజలి శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ RC15 చిత్రంలో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…