గర్భం దాల్చారని వైద్యులు ఆ మహిళకు చెప్పడంతో తాను తల్లి కాబోతున్నానని ఎంతో సంబరపడిపోయింది. తన బిడ్డ కోసం ఎన్నో కలలు కనింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి నెల వైద్య పరీక్షలు చేయిస్తూన్న వైద్యులు బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. అయితే ఆమెకు 9 నెలలు పూర్తి అయి పదవ నెల కూడా పూర్తి కావస్తున్న పురిటినొప్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. ఈ స్కానింగ్ లో ఎవరూ ఊహించనటువంటి నిజాలు బయటపడ్డాయి. తన కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఎంతో షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయవాడ గులాబీ తోటకు చెందిన కె.సుధారాణి(21)కి శ్రీకాకుళానికి చెందిన సంతోష్‌తో వివాహం జరిగింది. ఏడో నెల గర్భిణిగా ఉన్న సుధారాణి పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విజయవాడలోనే పాత ఆస్పత్రిలోని మాతాశిశు విభాగంలో వైద్య పరీక్షల కోసం వస్తోంది. మూడునెలల నుంచి ఆస్పత్రికి వస్తున్న ఆమె కడుపులో బిడ్డ ఏ విధంగా ఉందని వైద్యులు పరీక్షించ లేదు.బిడ్డ ఆరోగ్యం గానే ఉంది నొప్పులు రాగానే ఆస్పత్రికి రండి అని చెప్పి సిబ్బంది పంపించారు.అయితే ఆమెకి 10 వ నెల పూర్తి కావస్తున్న పురిటినొప్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒకసారి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు.
ఈ విధంగా స్కానింగ్ చేయడం వల్ల తన కడుపులో బిడ్డ కాదు పెరిగేది గడ్డ అని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎంతో షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం విజయవాడ పాత ఆస్పత్రి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి దారుణం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్లే బాధితులకు స్కానింగ్ చేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బిడ్డ పెరుగుదల ఆగిపోవడం వల్లే ఈ విధంగా ఇన్ఫెక్షన్ కి దారితీసింది ఉందని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…