ప్రేమంటే అంతే.. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ ఒకరికి ఒకరు తోడుండాలి. ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలు ఇచ్చేందుకైనా, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అవును.. ఆ జంట కూడా సరిగ్గా ఇలా చేసింది. భర్త తనకు ప్రేమను పంచితే భార్య తన భర్తకు తన శరీర అవయవాన్ని పంచి ఇచ్చింది. ఈ సంఘటనకు హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్ లో ఉన్న గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వేదికగా నిలిచింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు కావడంతో వారు పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే సుబ్బారెడ్డికి గుండె పోటు వచ్చింది. దీంతో వైద్యులు స్టంట్లు వేశారు. అనంతరం గతేడాది అతనికి కామెర్లు వచ్చాయి. పరిస్థితి విషమించింది. దీంతో అతన్ని మళ్లీ అదే హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో అతనికి పరీక్ష చేసిన వైద్యులు అతని లివర్ పూర్తిగా దెబ్బ తిన్నదని చెప్పారు. లివర్‌ను మార్పిడి చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు.
దీంతో ముంతాజ్ తన భర్తకు లివర్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఆపరేషన్ చేశారు. అందుకు రూ.20 లక్షలు ఖర్చు కాగా, రూ.10 లక్షలను ఏపీ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేసింది. ఇక ఆపరేషన్ విజయవంతం కావడంతో భార్య, భర్త ఇద్దరూ కోలుకుంటున్నారు. అలా సుబ్బారెడ్డి ఆమెకు ప్రేమను పంచితే ఆమె తన లివర్‌ను పంచి ఇచ్చింది. తన భర్తను రక్షించుకుంది. ఇప్పుడు వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…