అది స్థానికంగా ఉన్నటువంటి ఒక జూనియర్ కళాశాల. ఎప్పటిలాగే సిబ్బంది కళాశాలకు హాజరై వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కళాశాల ప్రిన్సిపల్ ఆఫీస్ రికార్డ్స్ అడగడంతో బీరువా దగ్గరకు వెళ్ళిన అటెండర్ కు ఊహించని షాక్ తగిలింది. అప్పటికే బీరువాలో నుంచి వింత శబ్దాలు రావడంతో పెద్దగా పట్టించుకోని అతను ఒక్కసారిగా రికార్డుల కోసం బీరువా తెరిచి చూడటంతో గట్టిగా అరుస్తూ పరుగులు తీశాడు. బీరువాలో బుసలు కొడుతూ తాచుపాము ఉండటంతో భయంతో అటెండర్ బయటకు పరుగులు పెట్టాడు.
ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ జిల్లా విజయనగరంలోని గణపతి నగర్ లో ఉన్న జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటన గత రెండు రోజుల క్రితం జరగడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఆమడదూరంలో ఉన్న పాములు చూస్తేనే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది ఎదురుగా కనిపిస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది.
ఇలాంటి ఘటన కళాశాల అటెండర్ కు చోటు చేసుకోవడంతో అతడు వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై వెంటనే ఈ సమాచారాన్ని స్నేక్ స్నాచర్స్ కు తెలియజేయడంతో వారు కాలేజీకి చేరుకుని ఎంతో చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో ఆ పామును వదిలి పెట్టారు. కాగా కాలేజీ బీరువాలో తాచు పాము ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…