ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి పట్ల కొందరు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు వస్తే ఎక్కడ కోవిడ్ సోకి చనిపోతామేమోనని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం లేదు. సరిగ్గా ఆ నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఇలాగే చేశారు. కానీ ఎట్టకేలకు పోలీసులు వచ్చి వారిని బయటకు తీసుకువచ్చి రక్షించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని కడలి అనే గ్రామంలో గురునాథ్, రుత్తమ్మ, కాంతమణి, రాణి అనే నలుగురు కుటుంబ సభ్యులు గత 15 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కాగా ఓ గ్రామ వాలంటీర్ తాజాగా వారి ఇంటికి వచ్చి వారికి ప్రభుత్వ పథకం ప్రకారం ఇంటి ప్లాట్ అలాట్ అయిందని, వేలిముద్ర వేయాలని కోరాడు. అయినప్పటికీ వారు బయటకు రాలేదు. అలా వారు ఎవరు వచ్చి పిలిచినా బయటకు రాలేదు. అలాగే ఇంట్లోనే ఉన్నారు.
అయితే ఆ వాలంటీర్ పోలీసులకు సమాచారం అందింగా వారు వచ్చి ఆ కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చారు. వారు నలుగురూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇంకొన్ని రోజులు వాళ్లు అలాగే ఉంటే చనిపోయేవారని పోలీసులు తెలిపారు. వారి ఇంటి పక్కన ఓ కుటుంబంలో ఓ వ్యక్తి అప్పట్లో కోవిడ్ వల్ల చనిపోయాడని, అందుకనే అప్పటి నుంచి వారు భయపడి ఇంటి నుంచి బయటకు రాలేదని పోలీసులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…