Tollywood : గత కొద్ది నెలలుగా అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలో పవన్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఆయన ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేశారు. దీంతో పవన్‌ను ఏపీ మంత్రులు విమర్శించారు.
పవన్ లాంటి అగ్ర హీరోలు అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే బదులు దాన్ని తగ్గించుకుంటే.. తగ్గిన సినిమా టిక్కెట్ ధరలతో పెద్ద నష్టమేమీ ఉండదని మంత్రులు అన్నారు. దీంతో ఈ వివాదం అప్పట్లో చిలికి చిలికి గాలివాన అయింది. ఆ తరువాత అది పవన్ వర్సెస్ పోసానిగా మారింది. ఇక ఆ తరువాత మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ వివాదాన్ని చాలా మంది మరిచిపోయారు.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ విషయాన్ని మరిచిపోలేదు. జీవోల మీద జీవోలు తెచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీని తరువాత కరోనా మూడో వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. కాగా ఈ మధ్యే చిరంజీవి మరోమారు సీఎం జగన్‌ను కలిశారు. ఈ క్రమంలో సయోధ్య కుదిరిందని.. త్వరలోనే టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెబుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవే నిజం కానున్నాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం త్వరలోనే సినిమా టిక్కెట్ ధరలపై మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలను థియేటర్లు అవసరం అయినప్పుడు పెంచుకునేలా మళ్లీ ఇంకో జీవోను విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే టాలీవుడ్‌కు పండుగ చేసుకునే వార్త అని చెప్పవచ్చు. దీంతో త్వరలో విడుదల కానున్న సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై పాజిటివ్‌గా ఉందని కూడా తెలిసింది. మరి ఆ జీవోను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…