Suma : విశ్వక్‌సేన్‌తో యాంకర్ దేవి నాగవల్లి గొడవ పెట్టుకోవడం ఏమోగానీ.. ఆయన సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. ఓ దశలో విశ్వక్‌సేన్ రియల్ హీరో అయ్యాడు. ఆయనకే నెటిజన్లు మద్దతుగా నిలిచారు. దేవి నాగవల్లి చేసిందే తప్పని చాలా మంది ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే ఇప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ఆమెపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. అసలు విషయం ఏదైనప్పటికీ మధ్యలోకి దేవి నాగవల్లిని తీసుకువస్తూ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇక ఇటీవలే జబర్దస్త్ షోలోనూ దేవి నాగవల్లి టైప్ లో పొట్టి నరేష్ గెటవుట్ అంటూ సందడి చేశాడు. ఆమెను ఇలా వాడేస్తున్నారు.
కాగా కేవలం పొట్టి నరేష్ మాత్రమే కాదు.. దేవి నాగవల్లి గెటవుట్ అనే డైలాగ్‌ను చాలా మంది ఊతపదంగా కూడా మార్చుకున్నారు. చాలా మంది ఆ డైలాగ్‌తో ఆమెను ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన క్యాష్ షో ప్రోమోలోనూ దేవి నాగవల్లి డైలాగ్‌ను సుమ ఇమిటేట్ చేసింది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు డేగల బాబ్జీ టీమ్ హాజరు కాగా.. వారిలో బండ్ల గణేష్, సమీర్ తదితరులు ఉన్నారు. అయితే ఓ దశలో సమీర్‌ను ఉద్దేశించి సుమ.. గెటవుట్ అని యాంకర్ దేవి నాగవల్లి డైలాగ్‌ను చెబుతుంది. దీంతో సమీర్ కూడా మీరు నన్ను ఎలా బయటకు పంపిస్తారు ? అని ప్రశ్నిస్తాడు.
చివరకు బండ్ల గణేష్ కలగజేసుకుని.. ఈటీవీ శాశ్వతం.. క్యాష్ షో శాశ్వతం.. సుమ శాశ్వతం కాదు.. అంటూ డైలాగ్ కొడతాడు. దీంతో షోలో నవ్వులు విరబూశాయి. కాగా ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఈ నెల 28వ తేదీన ప్రసార కానుంది. ఈ ప్రోమోను చూస్తే క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్ నవ్వులను పంచుతుందని అర్థమవుతోంది. ఇక ఈ మధ్యే జబర్దస్త్ షోలోనూ నరేష్ గెటవుట్ అనే డైలాగ్‌ను వాడి అందరికీ నవ్వు తెప్పించాడు. దేవి నాగవల్లి ఇలా గొడవలో ఇరుక్కోవడం ఏమోగానీ.. ఆమెను పదే పదే ఇలా ఆమె వాడిన డైలాగ్‌తో టార్గెట్ చేస్తున్నారు. ఇక చివరకు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…