Anchor Suma : విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ లు నటించిన మల్టీ స్టారర్ మూవీ ఎఫ్3. ఎఫ్2కు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుండగా.. సినిమాకు సంబంధించి శనివారం (మే 21) చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంకర్‌గా వ్యవహరించిన సుమ తన పంచ్‌లు, తెలంగాణ యాసతో అదరగొట్టింది.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమ.. మూవీ కామెడీ మూవీ కనుక సహజంగానే ఫన్నీ మాటలు మాట్లాడుతూ అలరించింది. అయితే ఈ ఈవెంట్‌లో సుమ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో నిర్మాత బండ్ల గణేష్ అన్నట్లుగా ఒక వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా. ఓ ప్రముఖ దర్శకుడు తనను భీమ్లా నాయక్ ఈవెంట్‌కు హాజరు కాకుండా అడ్డుకున్నాడు.. అని ఆ వాయిస్‌లో ఉంది. అది అచ్చం బండ్ల గణేష్ వాయిస్‌ను పోలి ఉంది. దీంతో ఆయనే ఆ వ్యాఖ్యలు చేశాడని అందరూ అనుకున్నారు. కానీ తాను ఆ కామెంట్స్ చేయలేదని ఆయన తరువాత స్పష్టత ఇచ్చారు. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్‌కు రాకుండా బండ్ల గణేష్‌ను ఏ విధంగా అయితే అడ్డుకున్నారో.. అలాగే తనను ఎఫ్3 ఈవెంట్‌కు రాకుండా కొందరు అడ్డుకున్నారు.. అంటూ సుమ కామెంట్స్ చేసింది.
అయితే ఆమె కావాలనే ఆ కామెంట్స్ చేసిందా.. లేక.. నిజంగానే తనను ఎఫ్3 ఈవెంట్‌కు రాకుండా ఎవరైనా అడ్డుకున్నారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో దాదాపుగా ప్రతి ఒక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుమనే వ్యాఖ్యాతగా మనకు దర్శనమిస్తోంది. కనుక ఆమె పట్ల యాంకర్ల లోకం కాస్త గుర్రుగా ఉన్నట్లు అర్థమవుతోంది. కనుకనే సుమ ఈ విధంగా వ్యాఖ్యలు చేసిందా.. అని అనుకుంటున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా ముగియగా.. సినిమా బంపర్ హిట్ ఖాయమని.. చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే టిక్కెట్ల రేట్లను కూడా పెంచలేదు కనుక ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ఆశిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…