Anchor Suma : యాంకర్ దేవి నాగవల్లితో వివాదం ఏమోగానీ విశ్వక్‌సేన్‌కు ఈ విషయం బాగానే కలసి వచ్చింది. ఆయన నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా గురించే చర్చంతా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీకెండ్‌లో ఈ మూవీ మరిన్ని వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మూవీ విడుదలైన రోజే పాటిజివ్ టాక్‌ను సాధించి దూసుకుపోతోంది. దీనికి తోడు మరోవైపు దేవితో ఏర్పడిన గొడవ కారణంగా చాలా మంది విశ్వక్‌కు సపోర్ట్‌ను ఇస్తున్నారు. ఆయన మూవీని చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో విశ్వక్ హిట్ కొట్టాడని చెప్పవచ్చు. అయితే విశ్వక్, దేవి గొడవ ఏమోగానీ.. మధ్యలో యాంకర్ సుమ బాగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
యాంకర్ సుమ బుల్లితెరపై ఏవిధంగా సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈమె సినిమా ఈవెంట్లతోపాటు టీవీ షోలలోనూ పాల్గొంటూ అలరిస్తోంది. అయితే చాలా ఏళ్ల తరువాత జయమ్మ పంచాయితీ అనే మూవీతో ఈమె వెండితెరపై అలరించేందుకు ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా శుక్రవారమే రిలీజ్ అయింది. కానీ ఈమె సినిమా గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. సినిమా కథ బాగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులు చాలా మంది విశ్వక్ సినిమా వైపు మొగ్గు చూపారు. కారణం.. ఆయనను దేవి తిట్టడమే అని చెప్పవచ్చు. వారి గొడవ కారణంగా విశ్వక్‌కు బాగానే సానుభూతి లభించింది. దీంతో అది ఆయన సినిమాకు ప్లస్ అయింది. ఫలితంగా అశోకవనంలో మూవీని ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. దీంతో సుమ జయమ్మ పంచాయితీ మూవీని చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఫలితంగా సుమకు ఎక్కువగానే నష్టం జరిగిందని చెప్పవచ్చు.
ఇక శుక్రవారం ఇంకో మూవీ రిలీజ్ అయింది. శ్రీవిష్ణు నటించిన భళా తందనాన కూడా వచ్చింది. అయితే సుమ సినిమా గురించైనా అంతో ఇంతో మాట్లాడుకున్నారు. కానీ ఈ మూవీనైతే అసలు ఎవరూ పట్టించుకోలేదు. ఈ మూవీ వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియలేదు. ఏది ఏమైనా విశ్వక్‌కు తన గొడవ కలసి వచ్చిందనే చెప్పవచ్చు. వీకెండ్ లో ఈ మూవీకి దాదాపుగా ఏవీ పోటీలేవు. కనుక విశ్వక్ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్‌ను సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…