Anchor Devi : నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే 99 శాతం మంది విశ్వక్ సేన్‌కే తమ మద్దతు తెలుపుతున్నారు. దేవి చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు. ఒక హీరోను స్టూడియోకు పిలిచి అవమానించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ముందుగా దేవి ఆయనను తిట్టబట్టే ఆయన ఆవేశంలో అలా మాట్లాడాడని.. కనుక దేవి సహనం కోల్పోయిందని అంటున్నారు. ఇక ఇదే విషయమై ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అనేక మంది విమర్శిస్తున్నారు.
అయితే లేటెస్ట్‌గా ప్రముఖ హేతువాది బాబు గోగినేని కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యారు. ఆయన విశ్వక్ సేన్‌కు సపోర్ట్ గా నిలిచారు. ప్రాంక్ వీడియో చేస్తే ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ హెచ్ఆర్‌సీ దాకా వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే గతంలోనూ దేవి ఇలాగే నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిందని.. దానిపై ఎందుకు ఆమె మాట్లాడడం లేదని అన్నారు. ఇక ఆమె జర్నలిజం వీడియోలను షేర్ చేస్తూ ఆయన దేవి పరువు తీశారు. కనీస జ్ఞానం లేకుండా ఆమె జర్నలిస్టు ఎలా అయ్యింది.. ఆమెకు సైన్స్ అసలు తెలియదు.. అంటూ ఆమె రిపోర్టింగ్ చేసిన ఓ వీడియోను కూడా బాబు గోగినేని షేర్ చేసి ఆమెకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయనే ఇంకో పోస్టు ద్వారా మళ్లీ స్పందించారు.
మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం దేవి అలా మాట్లాడకూడదని.. ఒక వ్యక్తిని డిప్రెస్డ్ అని, మానసిక రోగి, మెంటల్ అని అనవద్దని.. కేవలం చికిత్స తీసుకునేటప్పుడే అలా మాట్లాడాలని.. కనుక దేవి చేసింది పెద్ద నేరమని అన్నారు. అందుకు 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని.. హైకోర్టు న్యాయవాది ప్రమోద్ రెడ్డి తెలిపారని.. అన్నారు. అయితే బాబు గోగినేని ఈ విధంగా వరుస పోస్టులతో దేవిపై విరుచుకు పడుతుండడంతో ఆయన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…