Anasuya : బుల్లితెరపై సందడి చేస్తూ వెండితెరపై అదరగొడుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా కనిపించి సందడి చేసిన అనసూయ ఇప్పుడు పుష్ప చిత్రంలో దాక్షాయణిగా కనిపించనుంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. ఇందులో భయంకరమైన లుక్‌లో కనిపిస్తూ ప్రకంపనలు పుట్టిస్తోంది. మంగళం శీను పాత్ర పోషిస్తున్న సునీల్ భార్యగా అనసూయ కనిపించనున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇటీవల ‘మంగళం శీను’ అంటూ సునీల్ పాత్రను మనకు పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా అనసూయ పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేసి అంచనాలు పెంచారు. ఈమె పాత్ర పీక్స్‌లో ఉంటుందని పోస్టర్ ద్వారా అర్ధమవుతోంది. అనసూయ చివరిగా ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’, ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాల్లో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…