Anasuya : బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ అటు సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయ ఆ పాత్రలో జీవించేసింది. దీంతో ఆ పాత్ర ఈమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. సినిమాల్లోనూ తన నటనతో అలరిస్తున్న అనసూయకు ఆఫర్లు కూడా అదేవిధంగా వస్తున్నాయి. ఇక పుష్ప మూవీలో దాక్షాయణి పాత్రలో అదరగొట్టేసింది. తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించి అలరించింది. దీంతో త్వరలో ప్రారంభం అయ్యే పుష్ప 2లోనూ ఈమె నటించనుంది.
అయితే అనసూయ శరీరంపై రెండు చోట్ల టాటూలు ఉన్న సంగతి తెలిసిందే. ఛాతిపై ఎడమవైపు, ఎడమ చేతి మీద మొత్తం రెండు టాటాలు ఉన్నాయి. ఛాతిపై నిక్కు అని ఆంగ్ల అక్షరాలతో టాటూ వేయించుకుంది. దీని అర్థం ఏమిటో ఆమె గతంలోనే చెప్పేసింది. ట్విట్టర్‌లో ఆమె నెటిజన్లతో గతంతో ముచ్చటించింది. దీంతో ఓ నెటిజన్ ఆమెను ఛాతిపై ఉన్న టాటూకు అర్థం ఏమిటని అడిగాడు. దీంతో అనసూయ నిక్కు అని బదులిచ్చింది. తన భర్తకు ఉన్న ముద్దు పేరు అదని తెలియజేసింది. ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ అన్న విషయం తెలిసిందే. ఆయనను నిక్కు అని పిలుచుకుంటానని చెప్పింది. అందుకనే ఆ టాటూ వేయించుకున్నట్లు వివరించింది.
ఇక చేతిపై కూడా టాటూ ఉంటుంది. కలోన్ అనే పదాన్ని టాటూగా మనం చూడవచ్చు. ఇది వాస్తవానికి ఇంగ్లిష్ పదం కాదు.. గ్రీక్ భాషకు చెందినది. దీనర్థం.. సహజసిద్ధమైన అందం అని వస్తుంది. అంటే మనుషుల బాహ్య అందాన్ని కూడా అంతర్గతంగా ఉండే అందాన్ని చూడాలని.. అదే సహజసిద్ధమైన, నిజమైన అందం అని అర్థం. అంటే ఎవరైనా రూపు రేఖలు బాగా లేకున్నా మంచి మనస్సు ఉంటే అలాంటి వారి గురించి చెప్పేందుకు ఆ పదం వాడుతారు. అయితే దీన్ని మాత్రం ఎందుకు వేయించుకుందో అనసూయ చెప్పలేదు. కానీ ఎప్పుడో ఒకసారి దీని గురించి కూడా ఎవరైనా అడుగుతారు.. అప్పుడు ఈమె సమాధానం చెబుతుంది.. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…