Anasuya : ఓ వైపు బుల్లితెరపై పలు టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా అనసూయ చాలా బిజీగా మారింది. ఈ మధ్య కాలంలో ఈమె అనేక సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఈమె దాక్షాయణిగా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించింది. అలాగే రవితేజ ఖిలాడి సినిమాలోనూ గ్లామరస్ పాత్రలో కనిపించి అనసూయ అలరించింది. అయితే తాజాగా ఇంకో పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈమె సిద్ధమవుతోంది.
అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. దర్జా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ విడుదల కాబోతోంది. దీన్ని సలీమ్ మాలిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనసూయ కనక మహాలక్ష్మి పాత్రలో నటిస్తోంది. కాగా ఈ మూవీకి చెందిన టీజర్‌ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేశారు. ఒక నిమిషం 11 సెకన్ల నిడివిగల ఈ టీజర్‌లో అనసూయ చాలా పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతూ కనిపించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ టీజర్‌లో అనసూయ పలు పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం చూడవచ్చు. ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది.. అనే స్ట్రాంగ్ డైలాగ్‌ను అనసూయ చెప్పింది. అలాగే.. నేను చీరకట్టిన శివాంగిని రా.. నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి.. అని కూడా ఆమె డైలాగ్ చెప్పింది. దీంతో ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సునీల్ మరో కీలకపాత్రలో నటించాడు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…