Ananya Nagalla : ఈ కుర్ర బ్యూటీ స్పీడ్ పెంచి దానికి కూడా ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. మల్లేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య నాగళ్ళ. కానీ గుర్తుకు వచ్చింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్. ఈ సినిమా ద్వారా అనన్య నాగళ్ళ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో ఈ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. చిత్రాల్లో చిన్న చిన్న ఆఫర్లు వస్తున్నా కూడా ఆమెకు క్రేజ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఎప్పటికప్పుడు చేసే హాట్ ఫోటోషూట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి.
అనన్య నాగళ్ళ తన లేటెస్ట్ ట్రెండీ వేర్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి ఉద్దేశంతో సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. నిజానికి అనన్య వకీల్ సాహెబ్ చిత్రంలో నటించిన పాత్ర చాలా చిన్నది. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ లో చెప్పుకోదగ్గ మ్యాటర్ మాత్రం లేదు. కానీ ఆమె ఎక్స్‌ప్రెషన్స్ జనాలకు బాగా నచ్చాయి. వకీల్ సాబ్ చిత్రంలో అనన్య పర్ఫామెన్స్, డెడికేషన్ బాగుంది అంటూ ఆ చిత్ర ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో అనన్య కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం అనన్య హీరోయిన్ ఆఫర్స్ వస్తున్న కూడా తన పాత్రకు గుర్తు ఉండే రోల్స్ చేయడానికి ఇష్టం చూపుతుందట. అనన్య నాగళ్ళ ఇకపై సిస్టర్ రోల్ కి కూడా ఓకే చేయనుందని తాజా సమాచారం వినిపిస్తుంది. ఈ సమాచారంతో సీనియర్ హీరో సినిమాలలో అనన్య నాగళ్ళకు సిస్టర్, డాటర్ రోల్స్ వస్తున్నాయట. ఇప్పటివరకు ఆమె వద్దకు వస్తున్న అన్ని ఆఫర్స్ అలాంటివే కావడంతో అనన్య నాగళ్ళ హీరోయిన్ గా కన్నా కూడా డాటర్స్, సిస్టర్స్ రోల్స్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. ఇందుకోసం మూవీ మేకర్స్ కూడా అనన్య కి రూ.70 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…