Amazon Jobs : డిగ్రీ అర్హ‌త‌తో అమెజాన్‌లో ఉద్యోగాలు.. ఇంట్లోనే ప‌ని.. నెల‌కు రూ.35వేల జీతం..

Amazon Jobs : ప్ర‌స్తుత త‌రుణంలో ఉద్యోగాల‌ను పొంద‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇప్ప‌టికే చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు. దీంతో వారు ఉద్యోగాల‌ను వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు. ఇక ఫ్రెష‌ర్స్ సంగ‌తి స‌రే స‌రి. అయితే ఏ డిగ్రీ ఉన్నా స‌రే.. అనుభ‌వం లేక‌పోయినా ఫ్రెష‌ర్స్ అయినా స‌రే.. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ అలాంటి అభ్య‌ర్థుల‌కు ఉద్యోగాల‌ను ఇస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే కంపెనీయే ల్యాప్‌టాప్ అందిస్తుంది. ఇంటి నుంచి కూడా ప‌నిచేయ‌వ‌చ్చు. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ సంస్థ హైద‌రాబాద్ రీజియ‌న్‌లో ప‌నిచేసేందుకు గాను బిజినెస్ ఆప‌రేష‌న్ స్పెష‌లిస్ట్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాల‌కు ఎంపికైతే మొద‌టి 2 నెల‌ల పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ఈ స‌మ‌యంలో రూ.20వేలను నెల‌కు చెల్లిస్తారు. అలాగే ట్రెయినింగ్ అనంత‌రం నెల‌కు రూ.35వేల ప్రారంభ జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక ఉద్యోగం చేయాల‌నుకున్న వారు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధానంలోనూ చేయ‌వ‌చ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా కంపెనీయే అందిస్తుంది.

Amazon Jobs

ఏదైనా డిగ్రీ ఉన్న‌వారు, ఫ్రెష‌ర్స్ లేదా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న‌వారు ఎవ‌రైనా స‌రే ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. అయితే అభ్య‌ర్థుల‌కు ప‌లు స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్ఎల్ లో మెళ‌కువ‌లు తెలిసి ఉండాలి. అలాగే ఓర‌ల్ అండ్ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ను క‌లిగి ఉండాలి. దీంతోపాటు ఈ-కామ‌ర్స్‌, బిజినెస్ సైట్ల‌పై ఆస‌క్తి క‌లిగి ఉండాలి. అలాగే ప్రాబ్ల‌మ్ సాల్వింగ్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్ వంటి అంశాలు తెలిసి ఉండాలి.

ఇలా అభ్య‌ర్థులు త‌మ‌కు ఆయా స్కిల్స్, అర్హ‌త‌లు ఉన్నాయ‌నుకుంటే ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు. అందుకు గాను https://amazonvirtualhiring.hirepro.in/registration/incta/ju0f4/apply/ అనే వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించి అక్క‌డ సూచించిన విధంగా ద‌ర‌ఖాస్తు ఫామ్‌ను నింపి స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు రోజులో 24 గంట‌ల్లో ఏ షిఫ్టులోనైనా స‌రే ప‌నిచేయాల్సి ఉంటుంది. అయితే 3-4 నెల‌ల‌కు ఒక‌సారి షిఫ్ట్ చేంజ్ చేస్తారు. ఇక వారంలో 5 రోజులే ప‌ని ఉంటుంది. మిగిలిన‌ 2 రోజులు వీక్లీ ఆఫ్ ల‌ను వ‌రుస‌గా ఇస్తారు. అయితే శ‌ని, ఆది వారాల్లో వీక్లీ ఆఫ్‌ల‌ను ఇవ్వ‌రు. కానీ వారంలో ఏ రెండు రోజులు అయినా స‌రే వ‌రుస‌గా వీక్లీ ఆఫ్‌ల‌ను ఇస్తారు. ఇలా ఈ ఉద్యోగంలో స‌దుపాయాలు ఉంటాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు ముందు ఇచ్చిన సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM