Green Peas : పచ్చి బఠానీలను సహజంగానే చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో పులావ్‌లు, మసాలా కర్రీలు, చాట్‌లు, బిర్యానీ, సమోసా.. వంటి వంటకాలను తయారు చేసి తింటుంటారు. వీటిని అలాగే రోస్ట్ చేసి ఉప్పు, కారం చల్లి తింటే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ప్రయోజనాలు అందుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి బఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, విటమిన్లు ఎ, సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే అనేక పోషకాలను పొందవచ్చు. అవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి.
2. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.
3. అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే ప్రయోజనం కలుగుతుంది. బరువు త్వరగా తగ్గవచ్చు. శరీరానికి శక్తి లభిస్తుంది.
4. షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారు తరచూ పచ్చి బఠానీలను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
5. పచ్చి బఠానీల్లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి అల్సర్లను నయం చేస్తాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
6. పచ్చి బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
7. పచ్చి బఠానీల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
8. పచ్చి బఠానీలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…