KGF 2 : ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కేజీఎఫ్ 2 గురించే ఎక్కువగా వినిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన కిక్‌తో కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్‌ను ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూద్దామా.. అని వేచి చూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ రెట్టింపవుతూనే ఉన్నాయి. ఈ నెల 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈసినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
కేజీఎఫ్ 2 కోసం యష్ సొంతంగా డైలాగులు రాశాడు. ట్రైలర్‌లో వయొలెన్స్ అనే డైలాగ్ ఉండగా ఇది నెటిజన్స్ కి బాగా నచ్చింది. దీనిపై అభిమానులు మీమ్స్ కూడా చేస్తున్నారు. ఈ మూవీలో యష్ తన డైలాగ్స్‌ను తానే రాసుకోవడం విశేషం.
ఇక కేజీఎఫ్ 2 సృష్టికర్తలు అభిమానుల కోసం మార్క్ జుకర్‌బర్గ్ కు చెందిన మెటావర్స్‌లో చిత్రానికి అంకితమైన డిజిటల్ విశ్వాన్ని సృష్టించారు. యాక్సెస్ పొందడానికి ఎల్ డొరాడో టోకెన్‌ని కొనుగోలు చేయవచ్చు.
ఈ సినిమా విడుదలకి ముందు సినిమా రూపకర్తలు వెబ్ ఆధారిత వినోదం ద్వారా ప్రత్యేక పేపర్‌ను విడుదల చేశారు. క్లాసిక్ పేపర్ ప్యాటర్న్‌ను కేజీఎఫ్ ట్యూన్స్ అంటారు. ఇందులోని పేపర్‌లో యష్ పాత్ర, రాకీ, దోపిడీల గురించి కథనాలు ఉన్నాయి. వాటిని ప్రేక్షకులు చదవొచ్చు.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన భారతీయ ట్రైలర్‌గా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇది 24 గంటల్లో ఐదు భాషల్లో 109 మిలియన్లకు పైగా వ్యూస్ ను దాటింది.
ఇక ఈ మూవీలో యష్ పక్కన నటించిన శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ చాప్టర్ 1 విజయవంతమైన కారణంగా కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కోసం ఏకంగా 7 సినిమాలను తిరస్కరించింది. మరి ఆమెకు అంతటి పేరు ఈ రెండో మూవీ ద్వారా వస్తుందో.. రాదో.. చూడాలి. ఇక ఈ మూవీ ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…