Amala Paul : కోలీవుడ్ ముద్దుగుమ్మ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మళయాళ బ్యూటీ అయినా అప్పట్లో తెలుగులో బాగానే సందడి చేసిండి. నటనతోపాటు ఆకట్టకునే గ్లామర్ ఈమె సొంతం. ఈ క్రమంలోనే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పటి వరకు చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించింది. గతంలో కన్నా ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె భిన్నమైన కథలను ఎంచుకోవడమే అని చెప్పవచ్చు. బోల్డ్ గా నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ ని వివాహం చేసుకుంది. అయితే పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. అనంతరం అమలాపాల్ తిరిగి సినిమాలతో బిజీ అయిపోయింది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతోంది.
ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ అందాల ముద్దుగుమ్మ చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా అమలాపాల్ బీచ్‌లో సందడి చేసింది. థైస్ కనిపించేలా స్విమ్ సూట్ ధరించి అందాల జాతర చేసింది. ఈమె గ్లామర్ షోను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు. సాధారణంగా అమలాపాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఏదోలా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా వారితో పంచుకుంటుంది. సినీ విశేషాలనూ పంచుకుంటుంది. ఒక్కోసారి చాలా బోల్డ్‌గా కనిపిస్తూనే అప్పుడప్పుడూ ట్రెడిషనల్ లుక్ లోనూ సందడి చేస్తుంటుంది. ఈ మధ్యే ఓనమ్ సందర్భంగా చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
2017లో విజయ్ నుండి విడిపోయిన తర్వాత అమలాపాల్ సింగిల్ గానే ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. ఈ మధ్యలో కొన్ని రోజులు అమలాపాల్ సింగర్ భవీందర్ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు, వీరిద్దరికి పెళ్లి అయినట్టు వార్తలు వచ్చినా అమలాపాల్ అలాంటివేం లేవని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు భవీందర్ కోర్టులో తనకి, అమలాపాల్ కి పెళ్లి జరిగిందని చెప్పడంతో ఆంతా ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్ ఎవరికీ తెలీకుండా రెండో పెళ్లి చేసుకుందా ? దాంట్లో కూడా విబేధాలు వచ్చి భవీందర్ తో విడిపోయిందా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వార్తలపై అమలాపాల్ మాత్రం స్పందించలేదు. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాలతో బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…