Aloe Vera Farming : క‌ల‌బంద పంట‌తో అధిక ఆదాయం.. రూ.10 ల‌క్ష‌ల‌కు పైగానే సంపాద‌న‌..

Aloe Vera Farming : ఆలోచ‌న ఉండాలే కానీ సంపాదించే మార్గం అదే వ‌స్తుంది. దానికి కాస్త శ్ర‌మ‌ను జోడిస్తే చాలు.. ఆదాయం అదే వ‌స్తుంది. ఇలా ఎంతో మంది ఎన్నో ఉపాధి మార్గాల‌ను పొందుతూ ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నారు. అలాగే అత‌ను కూడా మొద‌ట్లో ఆందోళ‌న చెందాడు. కానీ ఇప్పుడు ఏడాది ల‌క్ష‌ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తున్నాడు. అత‌ను ఒక‌ప్పుడు టీ అమ్మేవాడు. కానీ ఇప్పుడు క‌ల‌బంద పంట‌ను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు. అత‌నే రాజ‌స్థాన్‌కు చెందిన అజ‌య్ స్వామి.

అజ‌య్ స్వామికి తండ్రి నుంచి సంక్ర‌మించిన 0.66 ఎక‌రాల భూమి ఉంది. కానీ దాన్ని అత‌ను ఉప‌యోగించేవాడు కాదు. చిన్న‌త‌నంలోనే తండ్రి చ‌నిపోవ‌డంతో కుటుంబ బాధ్య‌త‌లు మీద ప‌డ్డాయి. దీంతో అత‌ను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషించ సాగాడు. రాజ‌స్థాన్ లోని హ‌నుమాన్ గ‌డ్ జిల్లా ప‌ర్లిక అనే గ్రామంలో అత‌ను నివాసం ఉంటున్నాడు. అయితే ఒక రోజు అత‌ను పేప‌ర్‌లో క‌ల‌బంద సాగుపై వ‌చ్చిన క‌థ‌నాన్ని చ‌దివాడు. దీంతో త‌న‌కు ఉన్న భూమిలో క‌ల‌బందను సాగు చేయాల‌ని అనుకున్నాడు. వెంట‌నే త‌న గ్రామంతో శ్మ‌శాన వాటిక‌తోపాటు అక్క‌డ‌క్క‌డా ఉన్న క‌ల‌బంద మొక్క‌ల‌ను సేక‌రించి త‌న పొలంలో మ‌ళ్లీ వాటిని నాటాడు.

Aloe Vera Farming

అయితే క‌ల‌బంద మొక్క‌ల‌ను అయితే నాటాడు. కానీ మ‌రోవైపు పంట చేతికి వ‌స్తుందా.. లేదా.. అని టీ వ్యాపారాన్ని కొన‌సాగించాడు. కానీ సంవ‌త్స‌రం తిరిగే లోపు పంట వ‌చ్చింది. అయితే వ‌చ్చిన పంట‌ను అమ్మ‌డం ఎలా అని ప‌రిశోధించాడు. క‌ల‌బంద‌ను జ్యూస్ చేసి అమ్మితే బాగా లాభాలు ఉంటాయ‌ని తెలుసుకుని కాస్త అప్పు చేసి అందుకు కావ‌ల్సిన యంత్రాల‌ను కొని జ్యూస్ తీసి అమ్మాడు. దీంతో లాభాలు వ‌చ్చాయి. ఇక అప్ప‌టి నుంచి అజ‌య్ స్వామి వెను తిరిగి చూడ‌లేదు. క‌ల‌బంద సాగునే జీవ‌న మార్గంగా మ‌ల‌చుకుని లాభాల‌ను గడించ‌సాగాడు.

అలా అత‌ను 2012లో తాను చేస్తున్న టీ వ్యాపారానికి స్వ‌స్తి చెప్పి పూర్తి స్థాయిలో క‌ల‌బంద‌ను పండించ‌డం మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే సొంత ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి క‌ల‌బంద ఉత్ప‌త్తుల‌ను త‌న ఫ్యాక్ట‌రీలోనే త‌యారు చేసి విక్ర‌యించ‌డం మొద‌లు పెట్టాడు. స‌బ్బులు, షాంపూలతోపాటు, జ్యూస్‌, ఆహార ఉత్ప‌త్తుల‌ను కూడా చేసి అమ్మసాగాడు. దీంతో లాభాలు వ‌చ్చాయి. అలా అజ‌య్ స్వామి త‌న భూమిలో క‌ల‌బంద సాగు చేస్తూ ఏడాదికి రూ.10 ల‌క్ష‌ల‌కు పైగానే సంపాదిస్తున్నాడు. ఇది చాలా లాభ‌సాటిగా ఉంద‌ని చెబుతున్నాడు.

క‌ల‌బంద‌ను సాగు చేసేందుకు నీళ్లు కూడా ఎక్కువ‌గా అవ‌స‌రం ఉండ‌వ‌ని అంటున్నాడు. పంట 6 నుంచి 12 నెల‌ల్లో చేతికి వ‌స్తుంది. సొంతంగా ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేస్తే ప్రాసెసింగ్ చేసి వివిధ ర‌కాల అలొవెరా ఉత్ప‌త్తుల‌ను సొంతంగా విక్ర‌యించ‌వ‌చ్చు. అలా చేసిన ఉత్ప‌త్తుల‌ను అనేక కంపెనీలు త‌న నుంచి కొంటున్నాయ‌ని అజ‌య్ స్వామి తెలియ‌జేశాడు. ఇక అర ఎక‌రం స్థ‌లంలో సుమారుగా 1500 వ‌ర‌కు మొక్క‌ల‌ను పెంచి మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నాడు. నిజంగా ఇలా చేస్తే ఎవ‌రైనా లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని అంటున్నాడు.

Share
Editor

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM