Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి హీరో అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే.. అంతర్జాతీయంగా కూడా చాలా మంది బన్నీ ఫ్యాన్స్ గా మారిపోయారు. పుష్ప సినిమాలో ఆయన వేసిన శ్రీవల్లి స్టెప్‌ను అనుకరిస్తూ ఎంతో మంది ఇప్పటికే వీడియోలు చేశారు. తమ సరదాలు తీర్చుకున్నారు. పలు బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు సైతం బన్నీ శ్రీవల్లి స్టెప్‌కు ఫిదా అయ్యారు. తీరికి దొరికినప్పుడల్లా ఆ స్టెప్‌ను వేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఇటీవలే వెకేషన్ నుంచి రాగా.. త్వరలోనే పుష్ప మూవీ రెండో పార్ట్‌లో నటించనున్నారు.
అయితే పుష్ప మూవీ రెండో పార్ట్ షూటింగ్‌ను ప్రారంభించే ముందు ప్రత్యేకంగా హోమం, పూజ చేయాలని అల్లు అర్జున్‌కు ఆయన స్నేహితులు సూచించారట. దీంతో అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు వాస్తవానికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ మూవీ హిందీ విడుదలపై చిత్ర యూనిట్ అనేక సమస్యలను ఎదుర్కొంది. అలాగే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాలేదు. దీంతో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దగ్గర ఉండి.. రోజుకు 18 నుంచి 20 గంటల పాటు సమయం కేటాయించి మరీ సినిమాను పూర్తి చేశారట. అందువల్ల అనుకున్న తేదీకి విడుదల చేశారు.
అయితే మొదటి పార్ట్ విడుదలకు ముందు తాము పడిన ఇబ్బందులు, వచ్చిన సమస్యలు, చేసిన హార్డ్ వర్క్.. రెండో పార్ట్‌కు ఉండకూడదని.. సినిమా షూటింగ్ సాఫీగా సాగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ అవ్వాలని కోరుతూ హోమం, పూజ చేయనున్నారట. అందుకోసమే అల్లు అర్జున్ ఆ పూజలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే పుష్ప 2 షూటింగ్‌ను ప్రారంభించనున్నారట.
ఇక పుష్ప 2ను మొదటి పార్ట్ కన్నా మరింత అద్భుతంగా తెరకెక్కించనున్నారని సమాచారం. మొదటి పార్ట్‌లో నటించిన స్టార్స్ చాలా మంది రెండో పార్ట్‌లోనూ నటించనున్నారు. కానీ రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక రెండో పార్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…