Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ మార్కెట్ ని కూడా పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ లోనూ విడుదల కానుండడంతో అల్లు అర్జున్ పూర్తిగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప సినిమా ప్రమోషన్‌లలో భాగంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 15 లో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 15 ద్వారా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తున్నారు. వివిధ భాషలలో అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. హిందీ మార్కెట్‌ను కూడా ఆకర్షించడం కోసం అల్లు అర్జున్ త్వరలో తన సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడి బిగ్‌బాస్ షోలో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…