ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్- బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాకోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా.. అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా నుండి ఏ అప్‌డేట్ వచ్చినా కూడా ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతున్నారు. తాజాగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్న సుక్కు గడ్డానికి బన్నీ బ్రష్‌తో బ్లాక్ కలర్ వేస్తున్న ఫొటో ఒకటి బయటకు రాగా, అది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది . ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్ పార్ట్ -1’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. రీసెంట్‌గా రెండు మిలియన్ల లైకులతో ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది.
పుష్పను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 17న విడుదల కానున్న మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ది రైజ్ ఆఫ్ పుష్పరాజ్ పేరుతో మూవీ టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. తాజాగా డిసెంబర్ 2న ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని నిర్ణయించారట సుకుమార్. మరి ట్రైలర్‌లో ఈ లెక్కల మాస్టర్ ఎన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ దాచాడో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…