Allipoola Vennela : తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. మహిళలందరూ రంగు రంగుల పువ్వులను అందంగా పేర్చి ఒక చోట చేర్చి బతుకమ్మ ఆడుతూ, జానపదాలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
అయితే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్మాణంలో తాజాగా విడుదలైన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఈ పాటను దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కించారు. ఆయనే ఈ పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటకు ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ క్రమంలోనే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఉత్తరా ఉన్నికృష్ణన్ ఈ పాటను పాడగా, ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ జరగనుంది. దీంతో ఈ పాట అశేష జనావళిని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…