NTR : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన విషయం విదితమే. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. దీంతో ఏప్రిల్ 28వ తేదీన ఈ మూవీని విడుదల చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే దర్శకుడు రాజమౌళి మళ్లీ సినిమా ప్రమోషన్లను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక తాజాగా ఎన్‌టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
ఎన్‌టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్‌టీఆర్ 30వ చిత్రం త్వరలో లాంచ్ కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ మూవీని లాంచ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బందిని నియమించుకునే పనిలో పడ్డారు.
దర్శకుడు కొరటాల శివ ఎన్‌టీఆర్ 30వ చిత్రానికి కొత్త టెక్నిషియన్లతో పనిచేయనున్నారు. ఇక ఈ మూవీలో ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆమె ఒప్పందంపై సంతకాలు చేసింది. మొన్నీ మధ్య వరకు ఆలియా భట్‌ను ఎన్‌టీఆర్ చిత్రానికి హీరోయిన్‌గా తీసుకోవాలని కొరటాల అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆలియా భట్ ఈ చిత్రానికి అధికారికంగా సంతకం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ నటించింది. కానీ ఎన్‌టీఆర్ పక్కన కాదు. రామ్ చరణ్ హీరోయిన్‌గా ఆమె యాక్ట్ చేసింది. ఈ క్రమంలో ఎన్‌టీఆర్ తదుపరి చిత్రంలో ఆలియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. గతంలో అనిరుధ్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసికి మ్యూజిక్ అందించారు. తరువాత ఆయన మ్యూజిక్ అందిస్తున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఎన్‌టీఆర్ 30వ చిత్రానికి కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…