Ali Reza : పలు సీరియల్స్‌లో నటించిన అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంతో ఫుల్ పాపులారిటీ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో మధ్యలోనే ఎలిమినేట్ అయినా తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కప్ కోసం గట్టిగా ప్రయత్నించినా అలీ రెజాకు నిరాశే ఎదురైంది. అయితే సావిత్రి సిరీయల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.
అలీ రెజా భార్య తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు అలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ‘అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. పాపని ఎత్తుకున్న ఫొటోని కూడా షేర్ చేశాడు. కాకపోతే ఆ పాప ఫేస్ కనపడకుండా జాగ్రత్తపడ్డాడు.
ఇటీవల అలీ భార్య మసుమ్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్ కపుల్‌గా అభివర్ణించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…