Akira Nandan : తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అకీరా ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఈ మధ్యనే అకీరా బర్త్ డేను జరుపుకోగా.. రక్తదానం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో అందరూ అచ్చం తండ్రిలాగే మంచి గుణం ఉన్నవాడంటూ మెచ్చుకున్నారు. ఇక అకీరా నందన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. చిన్న వయస్సు నుంచే అనేక కళల్లో అతను ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు.
అకీరా నందన్ ఇప్పటికే సంగీతం, హార్స్ రైడింగ్ వంటి కళల్లో ప్రావీణ్యత సంపాదించాడు. ఈ క్రమంలోనే తన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా.. పలు ఇతర సందర్భాల్లోనూ పియానోపై అద్భుతంగా పాటలను వాయించి ఆశ్చర్యపరిచాడు. అలాగే గుర్రపు స్వారీ కూడా చేయగలడు. తండ్రి పవన్ లా మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యతను సంపాదిస్తున్నాడు. అయితే అకీరా నందన్ లో ఉన్న ఇన్న టాలెంట్స్‌ను చూసి అతను సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా.. అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను స్కాట్లండ్‌లోని ఓ యూనివర్సిటీలో చదవనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే అకీరాతోపాటు రేణు దేశాయ్, ఆద్య కూడా అక్కడికి వెళ్లి వచ్చారు. అకీరాను యూనివర్సిటీలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆగస్టు నుంచి అతనికి క్లాసులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అయితే అకీరా ఇక అక్కడే ఉండి చదువుకోనుండడంతో రేణు దేశాయ్ అతన్ని విడిచి ఉండలేక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన చిట్టి పక్షి ఒకటి రెక్కలు వచ్చి గూడు నుంచి బయటకు వెళ్లిపోతుంది.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది.
అకీరా ఇన్ని రోజుల పాటు తల్లి వద్దే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఒంటరిగా గడపబోతున్నాడు. దీంతో అతన్ని విడిచి ఉండలేక రేణు ఆ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. అయితే ఈ విద్యాభ్యాసం 3 ఏళ్లలో ముగియగానే అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…