Akhanda Movie : నందమూరి బాలకృష్ణకు ఫ్లాపులు వచ్చినప్పుడల్లా బోయపాటి శ్రీను ఆపద్భాందవుడిలా కనిపిస్తున్నాడు. గత కొంత కాలంగా బాలయ్య ఫ్లాపులతో సతమతం అవుతుండగా.. అఖండ చిత్రంతో బాలయ్య రేంజ్‌ని మళ్లీ పెంచాడు బోయపాటి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా సినిమా, లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇక మళ్లీ ఏడేళ్ల తర్వాత వచ్చిన అఖండ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
కథలో కొత్తదనం లేకపోయినా బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపించడం, పోరాట ఘట్టాలు, డైలాగ్స్ అదిరిపోవడంతో ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలనే అగ్రిమెంట్ చేసుకోగా, ఈ సినిమా జనవరి 1 లేదా 2 తేదీలలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అఖండ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ డిసెంబర్ ఎండింగ్ లో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…