Akhanda Movie Review : నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఅఖండ సినిమా పెద్ద తెరపై ప్రత్యక్షం అయింది. పలు చోట్ల ప్రీమియర్స్, బెనిఫిట్స్ జరుపుకున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వచ్చిన హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు సినిమా షూటింగ్ జరుగుతుండగానే బోయపాటి రిలీజ్ చేసిన మూవీ అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
బాలకృష్ణ చిత్రంలో ఊరికి పెద్దగా ఉండే మురళీ కృష్ణ పాత్రలో నటించారు. ఆయన ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుంటారు. ఇక ఊరికి కలెక్టర్‌గా వచ్చిన శరణ్య పాత్రలో ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఊరి కోసం, ప్రజల కోసం మురళీ కృష్ణ పడే తాపత్రయం, నిస్వార్థమైన మనసు చూసి ఆకర్షితురాలు అవుతుంది శరణ్య. అలా ఇద్దరూ వివాహం చేసుకొని వైవాహిక జీవితం మొదలుపెడతారు.
అదే ఊరిలో వరదరాజులు (శ్రీకాంత్) అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటాడు. కాపర్ మైనింగ్స్ లో అకృత్యాలు సాగిస్తూ ఉంటాడు. ఆ మైనింగ్స్ వలన చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తెలుసుకున్న మురళీ కృష్ణ రంగంలోకి దిగుతాడు. దీంతో అతడిని జైలుకు పంపుతాడు వరదరాజులు. ఈ నిస్సహాయ స్థితిలో బాలయ్య అఖండగా ఎంట్రీ ఇస్తాడు. అఖండ ఎవరు, అతను ఏం చేస్తాడన్నది సినిమా చూస్తే అర్దమవుతుంది.
భారీ యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీక్వెన్సులు అభిమానులతోపాటు ఫ్యాన్స్ కి ట్రీట్ గా నిలిచాయి. అఘోరా పాత్రలో బాలయ్య నట విన్యాసం అద్భుతం. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. రాయలసీమ యాసలో బాలయ్య డైలాగ్స్ మరో ఆకర్షణ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
విలన్ గా శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో మొదటిసారి మంచి పాత్ర దక్కించుకుంది. కథలో కీలమైన కలెక్టర్ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. సాంగ్స్ లో బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ కూడా అద్భుతం. థమన్ బీజీఎం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. సినిమాలో కామెడీకి ఆస్కారం లేదు.
ఇది బాలయ్య వన్ మ్యాన్ షో అంటున్నారు. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. బాలయ్య అభిమానులకి ఇది పండగలా అనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…