Akhanda : బాలకృష్ణ సినిమాలకు మాస్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అఖండ కోసం అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను – నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ అఖండ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్ర టైటిల్ సాంగ్ టీజర్‌ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేసి రికార్డులు తిరగరాశారు. తాజాగా టైటిల్ ట్రాక్ ఫుల్ సాంగ్ వదిలారు.
‘ఖం ఖం ఖంగుమంది శంఖం.. భం అఖండ.. భం భం అఖండ..’ అంటూ సాగిన ఈ పాటలో అఘోరాగా బాలయ్య చాలా పవర్ ఫుల్ గా ఉన్నారు. త్రిశూలం పట్టుకుని, నుదుటికి విభూది రాసుకొని విధ్వంసకరంగా కనిపించారు. ఈ పాటను శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించగా, థమన్ కట్టిన బాణీలు శ్రోతలకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్ లో అఖండ గర్జన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. ‘అఖండ’ టైటిల్ సాంగ్ విజువల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని హింట్ ఇచ్చారు.
సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో కలిసి యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…