Aha : తెలుగు డిజిటల్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా డెవలెప్ అవుతున్న స్ట్రీమింగ్స్ లో ఆహా ఒకటి. ఈ ఓటీటీని అల్లు అరవింద్ స్థాపించారు. ఇందులో ఇంట్రెస్టెంగ్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనల్ని, ప్లాన్స్ ని తీసుకు వస్తూనే ఉన్నారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఆహా సక్సెస్ ఫుల్ గా 20 నెలలు పూర్తి చేసుకుని తెలుగులో బిగ్గెస్ట్ ఓటీటీ వేదికగా నిలిచింది. ఈ యాప్ ని చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చేస్తున్నారు. 50 మిలియన్స్ కు పైగా వినియోగదారులున్న ఈ యాప్ ని ఎప్పటికప్పుడు బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
టెక్నికల్ గా కూడా సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్న నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఆహా అవార్డ్స్ తో సత్కరించాలని అనుకుంటోంది. 20 నెలలు, 50 మిలియన్ వినియోగదారులు, 13 మిలియన్ ఇన్ స్టాల్స్.. విభిన్నమైన కంటెంట్ తోపాటు ఒరిజినల్ కంటెంట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రపంచంలో తెలుగు ప్రేక్షకులకు ఒకే వేదికగా మారి స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ గా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఆహా ఓటీటీలో 100 శాతం ఎంటర్ టైన్ మెంట్ అవార్డ్స్ తో తన 20 నెలల్లో టెక్నికల్ టీమ్ ను, యాక్టర్స్ ను గౌరవించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించిన వారిని సెలెక్ట్ చేయడానికి ప్రేక్షకులకు మంచి అవకాశాన్ని ఆహా టీమ్ అందిస్తోంది. ఈ క్రమంలో ఉత్తమ వెబ్ సిరీస్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటులు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్య నటుడు, బెస్ట్ డెబ్యూ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఉత్తమ నాన్ ఫిక్షన్ వెబ్ సిరీస్, ఉత్తమ చిత్రం ఇలా పలు రకాల కేటగిరీల్లో ఆహా అవార్డ్స్ ని అందించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…