Aha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత ప్రస్థానం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమంత కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సిరీస్ లో రాజీ అనే పాత్రలో నటించిన సమంతకు మొదట్లో అభినందనలు వచ్చినా ఆ తర్వాత ఈమె పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సిరీస్ తర్వాత సమంతకు ఎన్నో వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిని రిజెక్ట్ చేసిన సమంత తాజాగా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంతతో వెబ్ సిరీస్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ముందుకు రావాలనే ఆలోచనలో ఉండగానే.. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. సమంతతో వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి సమంతకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇది వరకు సమంత ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షో ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఇక ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో కోసం బాలయ్యకు రూ.కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరినీ నమ్ముకొని ఆహా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. మరి వీటి ఫలితం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…