Adipurush Movie : ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆది పురుష్. శ్రీరాముడి కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు.

కాగా ఈ మూవీలో అధిక భాగం గ్రాఫిక్స్ ఉండడంతో ప్రస్తుతం 50కి పైగా భిన్న కంపెనీలు గ్రాఫిక్స్ పనులు చేస్తున్నాయి. అందులో భాగంగానే సినిమాలో ఉన్న ఓ అడవి సీన్ కోసం ఏకంగా రూ.60 కోట్లను గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా కంపెనీలు ఈ మూవీకి సంబంధించిన సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనులను చేస్తున్నాయి.
ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. శ్రీరాముడి కథ కనుక.. అది అందరికీ తెలుసు కనుక.. చాలా మందికి ఈ మూవీ కనెక్ట్ అవుతుందని.. కనుకనే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆది పురుష్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా కొనసాగిస్తున్నారు.