Actress Shiva Parvathi : తెలుగు సినీ ప్రేక్షకులు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో ఈయన విలన్ పాత్రలు చేసేవారు. కానీ తరువాత హీరో అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో మోహన్ బాబు నటిస్తున్న చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. బాక్సాఫీస్ వద్ద అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. దీంతో మోహన్ బాబు కెరీర్‌లోనే ఈ మూవీ అత్యంత పెద్దదైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే మోహన్ బాబు ఎలాంటి వారు.. షూటింగ్ లొకేషన్‌లో ఎలా ఉంటారు.. ఇతర ఆర్టిస్టుల పట్ల ఆయన ఏవిధంగా ప్రవర్తిస్తారు.. వంటి విషయాలను నటి శివ పార్వతి తాజాగా తెలియజేశారు.
అప్పట్లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు, శోభన హీరో హీరోయిన్లుగా సినిమా వచ్చింది. ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇందులో మోహన్ బాబు డైలాగ్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో శివ పార్వతికి ఇదే మొదటి సినిమా కాగా.. ఇందులో ఆమె చిన్న క్యారెక్టర్‌ను పోషించారు. ఒక రోజు షూటింగ్ సమయంలో శివ పార్వతి సెట్‌లో ఉండగా.. ఆమెను చూస్తూనే విష్ చేయకుండా శోభన వెళ్లిపోయిందట. దీంతో ఈ విషయం గమనించిన మోహన్ బాబు శోభనను పిలిచి మందలించారట. ఆమె ఎవరు అనుకున్నారు.. మంచి నటి.. ఆమెను గౌరవించాలి.. అని శివపార్వతి గురించి శోభనకు చెప్పారట. అలా మోహన్ బాబు మంచి ఆర్టిస్టులకు చాలా గౌరవం ఇస్తారని.. శివ పార్వతి తెలిపారు.
అయితే మోహన్ బాబు ఎంత మంచి హృదయం ఉన్నవారో అంతే కోపంగా కూడా ఉంటారు. అది కూడా ఎవరైనా క్రమ శిక్షణ పాటించకపోయినా.. చెప్పిన పని చేయకపోయినా కోపంగా ఉంటారని.. శివపార్వతి తెలిపారు. అప్పట్లో నటీనటులు షూటింగ్ లొకేషన్‌లకు టైముకు వచ్చేవారు. కానీ ఇప్పుడు సమయపాలన పాటించడం లేదు. కనుకనే క్రమ శిక్షణగా ఉండాలని మోహన్ బాబు మందలిస్తుంటారని.. అంతేకానీ.. ఆయన అనవసరంగా ఎవరి మీద అరిచే వ్యక్తి కాదని.. ఆయన గొప్ప మనస్సు ఉన్నవారని.. ఇలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. అని శివ పార్వతి తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…