Actress Poojitha : న‌రేష్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యాలు చెప్పిన న‌టి పూజిత‌.. న‌రేష్ ఎలాంటి వారంటే..?

Actress Poojitha : గ‌త కొద్ది రోజులుగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల పేర్లు మారుమోగిపోతున్నాయి. వీరిద్ద‌రూ మైసూర్‌లోని హోట‌ల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికార‌ని చెప్పి న‌రేష్ భార్య ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆయ‌న త‌న‌ను గ‌న్ పెట్టి బెదిరిస్తూ విడాకులు కావాల‌ని అడిగార‌ని ఆరోప‌ణ‌లు చేసింది. అయితే మ‌రోవైపు న‌రేష్‌, ప‌విత్ర‌లు కూడా ఈ విష‌యంపై త‌మ వాద‌న‌ల‌ను వినిపించారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీలో దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఉన్నారు. మా అసోసియేష‌న్ కు ప‌నిచేశారు. ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న పేరు మొత్తం పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు.

న‌రేష్ వ్య‌వ‌హారం ఏమోగానీ.. నిన్న మొన్నటి వ‌ర‌కు మా అసోసియేష‌న్‌లో ఆయ‌న చుట్టూ ఉన్న‌వారు ఎవ‌రూ కూడా ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా మాట్లాడ‌డం లేదు. వ్య‌క్తిగ‌త విష‌యాల్లో అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చ‌డం ఎందుక‌ని అనుకున్నారో.. మ‌రేదైనా కార‌ణం ఉందో తెలియ‌దు కానీ.. తోటి న‌టీనటులు ఎవ‌రూ న‌రేష్ గురించి మాట్లాడ‌డం లేదు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా సీనియ‌ర్ న‌టి పూజిత కెమెరా ముందుకు వ‌చ్చారు. న‌రేష్ గురించి ఆమె మాట్లాడారు. న‌రేష్‌కు స‌పోర్ట్‌గా నిలిచారు. తాను ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి న‌రేష్‌ను చూస్తున్నాన‌ని.. ఆయ‌న‌తో ప‌లు సినిమాల్లోనూ న‌టించాన‌ని.. ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి అని అన్నారు. ఆయ‌న‌పై ర‌మ్య త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంద‌న్నారు.

Actress Poojitha

ర‌మ్య న‌రేష్ ఇంట్లో అస‌లు ఎన్న‌డూ క‌నిపించ‌లేద‌ని.. కేవ‌లం విజ‌య నిర్మ‌ల చ‌నిపోయిన‌ప్పుడు త‌న‌కు క‌నిపించింద‌ని.. ఆమె క‌న్నా ఇంకా త‌న‌కే న‌రేష్ ఇంటి నుంచి పిలుపులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయ‌ని.. తానే న‌రేష్ ఇంటికి చాలా సార్లు వెళ్లాన‌ని.. పూజిత తెలిపింది. తాను ఎప్పుడు వెళ్లినా ర‌మ్య క‌నిపించ‌లేద‌ని.. ఆమెను న‌రేష్ దూరం పెట్టి చాలా రోజులు అయింద‌ని ఆమె తెలియ‌జేసింది. న‌రేష్ మంచి వ్య‌క్తిత్వం ఉన్న‌వారని.. ఇండ‌స్ట్రీలో త‌న‌లాంటి వారు చాలా మంది ఉన్నార‌ని.. కానీ ఏ న‌టితోనూ ఆయ‌న ఎప్పుడూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌న్నారు. అలాగే న‌రేష్ త‌న‌కు ఎంతో స‌హాయం చేశార‌ని తెలిపారు. అలాంటి న‌రేష్‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తుంటే చూసి త‌ట్టుకోలేకే ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా మాట్లాడుతున్నాన‌ని తెలిపారు.

ర‌మ్య‌కు ఏదైనా కావాల‌నుకుంటే హైద‌రాబాద్‌లో మాట్లాడాల‌ని, బెంగ‌ళూరుకు వెళ్లి ఒక చాన‌ల్‌లో 8 గంట‌ల పాటు లైవ్ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని పూజిత ప్రశ్నించారు. ప‌విత్ర లోకేష్‌ను బ్యాడ్ చేసేందుకే ఆమె ఇలా ప్ర‌వ‌ర్తించింద‌ని అన్నారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాల‌ని.. మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయ‌డం ఎందుక‌ని అన్నారు. ప‌విత్ర లోకేష్ విష‌యానికి వ‌స్తే.. ఆమె భ‌ర్త అని చెబుతున్న సుచేంద్ర ప్ర‌సాద్‌కు, ఆమెకు ఇంకా పెళ్లి అయి ఉండ‌ద‌ని తాను అనుకుంటున్నాన‌ని.. న‌టి పూజిత తెలియ‌జేశారు. అయితే వాస్త‌వానికి ఇన్ని రోజుల నుంచి ఈ వ్య‌వ‌హారం జ‌రుగుతున్నా.. న‌రేష్ వైపు ఉన్న మా అసోసియేష‌న్ న‌టీన‌టులు ఎవ‌రూ.. ఆఖ‌రికి మంచు విష్ణు సైతం ఇంకా న‌రేష్‌కు స‌పోర్ట్‌గా మాట్లాడ‌క‌పోవ‌డం విశేషం. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్లో త‌ల‌దూర్చ‌డం ఎందుక‌ని అనుకుంటున్నారో.. ఇంకేదైనా కార‌ణం ఉందో తెలియ‌దు కానీ.. న‌రేష్ మాత్రం ప్ర‌స్తుతానికి ఏకాకి అయ్యార‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM