Acharya Movie : చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డె చిన్న పాత్ర పోషించింది. రామ్‌చరణ్‌కి జోడీగా చేసింది. చిరంజీవికి జోడీగా కాజల్ జత కట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్‌లో ఎక్కడ కూడా కాజల్ ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రైలర్‌లో కాజల్‌ని ఎక్కడా చూపించని చిత్ర బందం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఊసే ఎత్తలేదు.
దర్శకుడు కొరటాల శివ నుంచి మొదలు పెట్టి చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డె ఎవరూ అసలు కాజల్ గురించి మాట్లాడలేదు. దీంతో ఫ్యాన్స్ రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా ? లేదంటే కావాలనే కాజల్ పేరు మరిచిపోయారా.. అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్రను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది. కథానుగుణంగానే ఆమె సన్నివేశాలని తొలగించారని అంటున్నారు. అయితే లాహె లాహె సాంగ్‌లోని రెండు మూడు సీన్స్‌లో ఆమె ఉంటుందని తెలుస్తోంది.
కాజల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసిన తర్వాత చిత్ర బృందం ఆమెతో ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించలేదు. అభిమానులని నిరాశపరచకుండా కాస్త గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెజీనాని తీసుకొచ్చారు. సినిమాలో హీరోయిన్ పార్ట్‌ని తొలగించి, ఆచార్యను బ్రహ్మచారిగా చూపించాలన్న కొరటాల నిర్ణయానికి చిరంజీవి కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ సన్నివేశాలని ఆచార్య నుండి తొలగించినట్టు టాక్. శనివారం హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి తదుపరి చిత్రాల దర్శకులు బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా కూడా అతిథిలుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…