Acharya Movie First Review : చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమాపై మెగాభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అతి కీలకమైన సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాకి సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గానే రావడం విశేషం. ఆచార్య ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయట.
చిత్రంలో సెకండాఫ్‌లో రామ్ చరణ్ కనిపిస్తాడని ఆయన పాత్ర చిరంజీవి కన్నా పవర్ ఫుల్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఎక్కువగా హైందవ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ధర్మస్థలిని కాపాడేందుకు జరిగే పోరాటం చుట్టూ కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇలా సినిమాకు పాజిటివ్ గానే సెన్సార్ టాక్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్ పవర్‌ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందనే టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన మగధీర, ఎవడు చిత్రాల్లో చనిపోయే పాత్రల్లో నటించారు. ఆయా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అదే కోవలో ఆచార్యకు రామ్ చరణ్ పాత్ర సిద్ధ చనిపోవడం కలిసి వస్తోందని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. కొరాటాల ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించాడని, సినిమా ప్రేక్షకులకి కొత్త అనుభవం అందిస్తుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…