సాధారణంగా చాలా మందికి నెలకు రూ.లక్షల్లో జీతం పొందుతున్నప్పటికీ కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రం వారి వక్రబుద్ధి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే అవినీతి శాఖ అధికారులకు దొరికి ఉద్యోగాలు కోల్పోతున్న ఘటనలను ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం..
ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్‌డివిజన్‌లో చరణ్‌సింగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మొయినాబాద్, శంకర్‌పల్లి, నార్సింగ్, ఇబ్రహీంబాగ్ డివిజన్లలో జరిగే పనులను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ ఉద్యోగం నిర్వహిస్తున్నందుకు చరణ్ సింగ్ నెలకు ఏకంగా 2 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నాడు. మణికొండకు చెందిన రవి అనే వ్యక్తి ఇదే శాఖలో చిన్నచిన్న కాంట్రాక్టు పనులను చేసేవాడు. ఈ క్రమంలోనే అందుకు అవసరమైన అనుమతి పత్రాన్ని ఇవ్వడం కోసం చరణ్ సింగ్ ఏకంగా అతన్ని లంచం అడిగాడు.
కాంట్రాక్టర్ రవి ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే అధికారుల సూచనల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం రవి రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లాడు. చరణ్ సింగ్‌కు డబ్బులు ఇస్తున్న క్రమంలో అవినీతి శాఖ అధికారులు దాడి చేసి అతనిని అరెస్టు చేసే.. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. అనంతరం జైలుకు పంపించినట్లు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…