Vankaya Wey Fry Recipe : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వంకాయలతో మనం అనేక కూరలను కూడా చేస్తుంటాం. సరిగ్గా చేయాలే కానీ వంకాయలతో ఏ కూర చేసినా రుచి అదిరిపోతుంది. చాలా మంది వంకాయలను ఇష్టంగా తింటుంటారు కూడా. అయితే వంకాయలతో ఇప్పుడు మేం చెప్పబోయే విధంగా కూర చేయండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా గనక చేసుకున్నారంటే ఇంట్లో అందరూ మళ్లీ ఇలాగే చేయమని అడుగుతారు. అంత అద్భుతంగా రుచి ఉంటుంది. ఇక వంకాయ కూరను ఎలా చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీడియం సైజు వంకాయలు – 2 (నాలుగు ముక్కలుగా తరగాలి), మీడియం సైజు టమాటాలు – 2 (సన్నగా తరగాలి), ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 2 (నిలువుగా చీరాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, ఆవాలు – 1 టీస్పూన్, జీలకర్ర – 1 టీస్పూన్, కరివేపాకు – 1 రెమ్మ, పసుపు – అర టీస్పూన్, కారం – 1 టీస్పూన్ లేదా రుచికి సరిపడా, ధనియాల పొడి – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర ఆకులు – కొన్ని (అలంకరణ కోసం).
ముందు పాన్ లేదా కడాయి పెట్టి అందులో నూనె వేసి మీడియం మంటపై వేడి చేయాలి. అనంతరం అందులో ఆవాలను వేసి చిటపటలాడించాలి. అందులోనే జీలకర్ర, కరివేపాకులను వేయాలి. కాసేపు సువాసన వచ్చే వరకు వేయించాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీరిన పచ్చి మిర్చి వేయాలి. ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత 1 నిమిషం అయ్యాక పచ్చి వాసన పోతుంది. అనంతరం అందులో సన్నగా తరిగిన టమాటాలను వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత తరిగిన వంకాయ ముక్కలను వేయాలి.
బాగా కలిపి మూత పెట్టాలి. ఇలా 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి. అందులో నీళ్లను కలపాల్సిన పని ఉండదు. మూత పెట్టి ఉడికిస్తాం కాబట్టి అందులో ఊరే నీళ్లు సరిపోతాయి. దీంతో వంకాయలు, టమాటాలు బాగా ఉడుకుతాయి. అన్నీ బాగా ఉడికాక మూత తీసి మళ్లీ 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో అదనంగా ఉన్న నీరు పోతుంది. అప్పుడు కూర బాగా వస్తుంది. మరీ నీళ్లు లేకుండా మరీ ఫ్రై కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. దీంతో కూర రెడీ అవుతుంది. దానిపై కొత్తిమీర ఆకులను వేసి అలకరించుకుంటే చాలు. ఇలా తయారు చేసిన వంకాయ వెట్ ఫ్రై కూర అందరికీ ఎంతగానో నచ్చుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు ఎందులో అయినా సరే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…