Tomato Juice : టమాటాలు.. చూడగానే నోరూరింపజేస్తాయి. వీటిని నిత్యం మనం ఏదో ఒక విధంగా తింటూనే ఉంటాం. అంతెందుకు.. నిత్యం మనం చేసుకునే కూరలు దాదాపుగా టమాటాలు లేనిదే పూర్తి కావంటే అతిశయోక్తి లేదు. అంతగా మనం వాటిని వాడుతున్నాం. అయితే మీకు తెలుసా..? కూరల్లో కన్నా టమాటాలను జ్యూస్‌గా చేసుకుని నిత్యం ఉదయాన్నే తాగితే దాంతో ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్లే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ క్రమంలో రోజూ టమాటా జ్యూస్ తాగితే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరంలో కణజాలం నశించకుండా చూస్తాయి.
తరచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. దీంతో మలబద్దకం పోయి విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్‌లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తనాళాల గోడలను దృఢంగా చేస్తాయి.
నిత్యం టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే నీరు బయటకు పోతుంది. టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి. చూపు స్పష్టంగా ఉంటుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి. రోజూ గంటల తరబడి వ్యాయామం చేసే వారికి, శారీరక శ్రమ చేసే వారికి అవసరమైన పోషకాలను టమాటా జ్యూస్ ఇస్తుంది. వారికి మళ్లీ శక్తి లభించి యాక్టివ్‌గా మారుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…