Radish : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి తెలుపు రంగులో ఉండే ముల్లంగి కాగా మరొకటి పింక్ రంగులో ఉండే ముల్లంగి. దీన్నే ఎర్ర ముల్లంగి అని కూడా పిలుస్తారు. మనకు ఎక్కువగా తెలుపు ముల్లంగి లభిస్తుంది. ముల్లంగితో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. కొందరు దీన్ని టమాటాలతో కలిపి వండుతారు. దీన్ని ఎక్కువగా చాలా మంది సాంబార్‌లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి ముల్లంగి అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. కూరల్లో వచ్చినా ఏరి పక్కన పడేస్తారు. కానీ ముల్లంగితో మనకు అనేక అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముల్లంగిని రోజూ తీసుకున్నా లేక దీని జ్యూస్‌ను రోజూ కొద్దిగా తాగుతున్నా అనేక లాభాలు పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. క్యాన్సర్ ఉన్నవారికి ముల్లంగి ఒక వరమనే చెప్పవచ్చు. ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది కణాల వినాశనాన్ని అడ్డుకుంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తనాళాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాదు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ముల్లంగిని రోజూ తీసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. ముల్లంగిలో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. గుండె పోటు, గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. ముల్లంగిలో ఉండే ఆంథోసయనిన్లు హైబీపీని తగ్గించడంలో సహాయం చేస్తాయి. అలాగే రక్తనాళాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.
ముల్లంగిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గించడంలో ముల్లంగి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. ముల్లంగిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా ముల్లంగి వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఇకపై మార్కెట్‌లో ఎక్కడ ముల్లంగి కనిపించినా విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. దీన్ని తీసుకుంటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…