Telekinesis : మనలో దెయ్యం సినిమాలంటే ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. ఆ సినిమాల్లో దెయ్యాలు ఒక చూపు చూడగానే గాల్లోకి మనుషులు, వస్తువులు వాటంతట అవే లేస్తాయి. వాటిని పట్టుకోకుండా, ముట్టుకోకుండానే దూరం నుంచే.. కేవలం చూపుల్తోనే వస్తువులను, మనుషులను దెయ్యాలు గాల్లోకి లేపుతుంటాయి. ఇక తెలుగు సినిమాల్లో పలువురు ప్రముఖ హీరోలు అయితే ఇలాంటి గిమ్మిక్కులు బాగానే చేస్తుంటారు. అయితే నిజానికి ఇలా వస్తువులను ముట్టుకోకుండానే వాటిని కేవలం మన చూపులతోనే గాల్లోకి లేపే విధానాన్ని టెలికైనెసిస్ (telekinesis) అని పిలుస్తారు. కొందరు దీన్నే సైకోకైనెసిస్ (Psychokinesis) అని కూడా అంటారు. మరి.. అసలు ఇది నిజంగా సాధ్యమవుతుందా..? ఈ విద్యను ఎవరైనా నేర్చుకోవచ్చా..? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం..!
పూర్వకాలంలో రుషులు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి అమితమైన తపో విద్యను సాధించడమే కాక పైన చెప్పిన టెలికైనెసిస్ విద్యను కూడా నేర్చుకునేవారట. అందుకనే వారు గాల్లో కూర్చుని తపస్సు చేసే వారని చెబుతారు. అయితే ఈ విద్యను నేర్చుకోవడం చాలా కష్టతరమట. అంటే.. సామాన్య మానవులకు సాధ్యం కాని విషయమట. అయితే ప్రయత్నిస్తే.. కఠోర శ్రమ చేస్తే ఈ విద్యను కూడా నేర్చుకోవచ్చని పలువురు చెబుతున్నారు. మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. మన శరీరంలోని అన్ని అవయవాల కన్నా మెదడుకే ఎక్కువగా శక్తి కావల్సి ఉంటుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే శక్తిలో మెదడు 20 శాతం శక్తిని ఉపయోగించుకుంటుంది. ఇక మనం నిద్రించేటప్పుడు మెదడు విశ్రాంతి తీసుకుంటుందని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనం నిద్రిస్తున్నా.. ఏ పని చేస్తున్నా సరే.. మెదడు తన పని తాను చేసుకుపోతుంది. అయితే భూమిపై ఉన్న మనుషుల్లో ఎవరైనా సరే.. తమ మెదడులో 10 శాతాన్నిమాత్రమే ఉపయోగిస్తారు. మిగిలిన 90 శాతంలో మెదడు పలు ఇతర పనులను చేసుకుంటుంది. పంచేంద్రియాలను అలర్ట్‌గా ఉంచుతుంది. శక్తిని వినియోగించుకుంటుంది.
చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతుందోననే చైతన్య అవస్థలో ఉంటుంది. అలాగే మిగిలిన భాగంలో మెదడు ఆలోచించడం, ఏకాగ్రతతో ఉండడం, జ్ఞాపకశక్తి కలిగి ఉండడం వంటి పనులు చేసుకుంటుంది. అయితే మెదడును ఆ 10 శాతం కాకుండా ఇంకా ఎక్కువ శాతం పనిచేసేట్టు చేస్తే పైన చెప్పిన టెలికైనెసిస్ విద్య దానంతట అదే వస్తుందట. లూసీ అనే హాలీవుడ్ సినిమాను చాలా మందే చూసి ఉంటారు. అందులో హీరోయిన్‌కు ఓ దశలో మెదడు 100 శాతం పనిచేస్తుంది. దీంతో ఆమెకు మానవాతీత శక్తులు వస్తాయి. వాటిల్లో ఒకటి ఈ టెలికైనెసిస్. అయితే అది సినిమా అని.. మెదడు 100 శాతం పనిచేయడం అసాధ్యం అని కొందరు కొట్టిపారేస్తుంటారు. కానీ మెదడును 100 శాతం పనిచేయించకపోయినా.. 10 శాతం కన్నా ఎక్కువగా పనిచేసేట్టు చేయవచ్చట. అంతెందుకు.. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు 13 శాతం పనిచేసేదట. అందుకనే ఆయన గొప్ప సైంటిస్టు అయ్యాడు. అయితే మెదడును 10 శాతం కన్నా ఎక్కువగా పనిచేసేలా చేయడమే ఇప్పుడు మనముందున్న సవాల్. ఇది గనక సాధ్యమైతే టెలికైనెసిస్ విద్య కూడా మనకు సాధ్యమవుతుంది.. మరి రానున్న తరాల్లో మన సైంటిస్టులు ఆ అద్భుతాన్ని కూడా ఆవిష్కరిస్తారా, లేదా చూడాలిక..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…