Spinach Juice : మనం నిత్యం తినే అనేక ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. దీంతో చాలా మంది పప్పు చేసుకుని తింటుంటారు. ఇక కొందరు పాలకూరలో టమాటాలను వేసి వండుకుంటారు. అయితే వంటల రూపంలో కాక పాలకూరను రోజూ నేరుగా తీసుకుంటే దాంతో మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే నిత్యం పాలకూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూరలో ఉండే విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు, ఇతర కంటి సమస్యలను రాకుండా చూస్తుంది. నిత్యం పాలకూర జ్యూస్ తాగితే నేత్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
పాలకూరలో ఉండే విటమిన్ కె రక్తాన్ని త్వరగా గడ్డ కట్టేందుకు దోహదపడుతుంది. మన శరీరంలో తగినంత విటమిన్ కె లేకపోతే గాయాలు అయినప్పుడు పెద్ద ఎత్తున రక్తస్రావం అవుతుంది. దాన్ని ఆపాలంటే మన శరీరంలో విటమిన్ కె ఉండాలి. పాలకూర జ్యూస్‌ను రోజూ తాగితే మనకు కావల్సినంత విటమిన్ కె లభిస్తుంది. దీంతో రక్తం త్వరగా గడ్డకడుతుంది. గాయాల బారిన పడినప్పుడు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. గర్భిణీలు నిత్యం పాలకూర జ్యూస్ తాగితే ఎంతో మంచిది. వారి కడుపులో ఉండే శిశువు పుట్టాక నాడీ మండల సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి.
పాలకూర జ్యూస్ నిత్యం తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పాలకూరలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ జ్యూస్ తాగితే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…