Rose Sharbat : గులాబీ పువ్వులు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని జడలో పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాగే దేవతా పూజలకు కూడా గులాబీలను ఉపయోగిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. గులాబీ పువ్వుల రెక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని పలు ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే గులాబీ పువ్వుల రెక్కలతో మనం ఎంచక్కా షర్బత్‌ను కూడా తయారు చేసి తాగవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ షర్బత్ తయారీకి కావల్సిన పదార్ధాలు..
గులాబీ రేకులు – ఒకటిన్నర కప్పులు, మరిగించిన నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల గింజలు – 1/4 టీస్పూన్, చక్కెర – ముప్పావు కప్పు, నిమ్మరసం – 1/4 కప్పు, దానిమ్మ గింజల రసం – ముప్పావు కప్పు,చల్లని నీళ్లు – 5 కప్పులు.
గులాబీ షర్బత్ తయారు చేసే విధానం..
ముందుగా గులాబీ రేకులను మెత్తగా నూరుకోవాలి. ఆ తరువాత ఆ ముద్దను గిన్నెలో వేసి అందులో మరిగించిన నీళ్లు పోయాలి. అనంతరం యాలకుల గింజలు కూడా వేసి మూత పెట్టి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ గులాబీ నీటిని పలుచని వస్త్రంతో వడకట్టుకోవాలి. అనంతరం వచ్చే ద్రవంలో చక్కెర వేసి బాగా కలపాలి. తరువాత వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుని అందులో వేడినీరు పోసి గులాబీ నీరు ఉన్న గిన్నెను అందులో ఉంచి చక్కెర కరిగే వరకు వేచి చూడాలి. తరువాత గిన్నెను బయటకు తీసి అందులో ఉన్న ద్రవాన్ని వడకట్టి చల్లార్చుకోవాలి. అనంతరం అందులో దానిమ్మ రసం, నిమ్మరసం, చల్లని నీళ్లు కలిపి గ్లాసుల్లో పోయాలి. అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. దీంతో చల్ల చల్లని గులాబీ షర్బత్ తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ షర్బత్‌ను తీసుకుంటే శరీరంలోని వేడి ఇట్టే తగ్గిపోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…